శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (12:01 IST)

రెండు తలల మగశిశువు జననం.. ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలోని ముషీరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రెండు తలల మగ శిశువు జన్మించాడు. అయితే పుట్టిన కొద్దిసేపటికే మరణించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహేశ్, సుజాత (27) దంపతులు ముషీరాబాద్ బాపూజీనగర్‌లో నివాసముంటున్నారు. మహేశ్ డ్రైవర్ కాగా, సుజాత గృహిణి. సుజాత గర్భం దాల్చడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని డంగోరియా మెటర్నిటీ నర్సింగ్‌హోమ్స్‌లో ఐదునెలల క్రితం చూపించారు. 
 
మళ్లీ రెండురోజుల క్రితం సుజాత చెకప్ కోసం రావడంతో వైద్యులు ఆమెకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్స్‌లో రెండు తలల మగ శిశువు ఉన్నట్టు గుర్తించారు. సీనియర్ డాక్టర్ దేవయాని డంగోరియా పర్యవేక్షణలో డాక్టర్ కుసుమ నార్మల్ డెలివరీ చేయగా రెండు తలల శిశువు జన్మించాడు. ఆ శిశువు కొద్ది సమయం అనంతరం మరణించాడు. ఇలాంటి కేసులు చాలా అరుదని వైద్యులు తెలిపారు.