శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (12:29 IST)

వియత్నాంలో బంగారు వర్ణపు హోటల్ ప్రారంభం

ప్రపంచంలోనే బంగారు పూత పూసిన తొలి హోటల్ వియత్నాంలో ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ తరహా హోటల్‌ను తయారు చేశారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఈ హోటల్‌ను బంగారు పూత రేకులతో తయారు చేశారు. డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్‌ హనోయ్ నగరంలో ప్రారంభించారు. ఈ హోటల్‌ మొత్తం బంగారు వర్ణం పూత పూశారు. ఈ పూత పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా తయారు చేశారు.
 
ముఖ్యంగా, బాత్రూమ్ నుంచి టైల్స్‌, స్విమ్మింగ్ పూల్స్, ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని బంగారు పూతను పూశారు. హోటల్ బాహ్య గోడలతో పాటు.. టాయిలెట్స్, సింకులు ఇలా ప్రతి ఒక్కదాన్ని గోల్డ్ ప్లేటెడ్‌తో తయారు చేశారు. ఈ కరోనా మహమ్మారి తర్వాత వియత్నాం పర్యటనకు వెళ్లినట్టయితే ఖచ్చితంగా ఈ వరల్డ్ గోల్డ్ ప్లేటెడ్ హోటల్‌ను ఓ లుక్కేయండి.