రెమ్‌డిసివిర్ ఔషధం మొత్తం కొనుగోలు చేసిన అమెరికా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేక పోయింది. అయితే, కరోనా వైరస్‌పై కొంతమేరకు ప్రభావితం చూపుతున్న మందుల్లో రెమ్‌డిసివిర్ ఒకటి. అందుకే అగ్రరాజ్యం అమెరికా ఈ ఔషధం మొత్తాన్ని కొనుగోలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఈ ఔషధాలను మొత్తం ఆ దేశమే కొనేసింది. ఈ మేరకు రెమ్‌డిసివిర్‌తో అమెరికా అసాధారణ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆ ఔషధాలను తమకే ఇవ్వాలని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకున్నది.
రెమ్‌డిసివిర్ మందును గిలీడ్ సైన్సెస్ సంస్థ తయారు చేస్తోంది. ఈ ఔషధం వాడిన వారు చాలా వేగంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్నట్లు తేలింది. దీంతో ఈ ఔషధాన్ని ఆమెరికా కొనుగోలు చేసింది. ఈ మేరుక యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.
రెమ్‌డిసివిర్‌ను ఉత్పత్తి చేసే గిలీడ్ సంస్థతో ట్రంప్ సర్కార్ అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నది. జూలైలో జరిగే వంద శాతం ఉత్పత్తిని అంటే సుమారు 5 లక్షల డోస్‌లతో పాటు ఆగస్టులో 90 శాతం, సెప్టెంబర్‌లో 90 ఔషధ సరఫరాను కూడా తమకే ఇవ్వాలని ట్రంప్ సర్కార్ గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొంది.