సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (14:53 IST)

అమిర్ ఖాన్ అమ్మకు కరోనా నెగెటివ్

బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ అమ్మకు కరోనా నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అమిర్ ఖాన్ బుధవారం అధికారికంగా వెల్లడించారు. తన సిబ్బందిలో కొందరు అనేక మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రస్తుతం ఆమిర్ ఖాన్ కుటుంబం హోం క్వారంటైన్‌లో ఉంది. 
 
తమ యూనిట్‌లోని అనేక మందికి కరోనా వైరస్ సోకిందనీ, అందువల్ల తామంతా హోం క్వారంటైన్‌లో క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత మా కుటుంబంలో చివరగా ఉన్న అమ్మకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని, ఆ ఫలితం నెగెటివ్ రావాలని ఆ దేవుడిని ప్రార్థించాలంటూ తన అభిమానులకు అమిర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. 
 
ఈ ఫలితం బుధవారం వచ్చింది. 'అందరకీ నమస్తే.. మా అమ్మకు కరోనా నెగెటివ్‌గా వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మేమంతా ఆరోగ్యంగా ఉండాలని  ప్రార్థించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. మీ ప్రియమైన ఆమిర్‌' అంటూ ఖాన్‌ ట్వీట్‌ చేశాడు. 
 
మా సహాయక సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో నేను, నా భార్య, పిల్లలు కరోనా పరీక్ష చేయించుకున్నామని మా  అందరికీ నెగెటివ్‌ వచ్చిందని ఆమిర్‌ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే.