గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:39 IST)

COVID-19: కరోనా వైరస్‌ చైనా ల్యాబ్‌లో పుట్టిందా.. చైనా మళ్లీ ఏం చెప్పిందేంటంటే?

covid
కరోనా వైరస్‌ చైనా ల్యాబ్‌లో పుట్టిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్‌పై వుహాన్ ప్రయోగశాల జన్యు మార్పు పరిశోధన నిర్వహించలేదని చైనా పునరుద్ఘాటించింది. 
 
ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి మూలాల గురించి ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి వైరస్ లీక్ అయిందా అని అనేక దేశాలు ప్రశ్నించాయి. దీనిని చైనా పదే పదే తిరస్కరించింది. 
 
దీనిపై మరోసారి ప్రస్తావిస్తూ, వుహాన్ ల్యాబ్‌లో కరోనావైరస్‌కు సంబంధించిన జన్యు మార్పు ప్రయోగాలు ఎప్పుడూ నిర్వహించలేదని చైనా గట్టిగా పేర్కొంది. "మేము దీనిని ఇంతకు ముందు చాలాసార్లు స్పష్టం చేసాం" అని చైనా మరోసారి స్పష్టం చేసింది.
 
 చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పేసింది.