మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (20:26 IST)

ఎస్.. లిజ్ ట్రస్ కంటే వెనుకబడ్డాను : రిషి సునక్

rishi sunak
బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ వెనుకబడ్డారు. మొదట రేసులో దూసుకొచ్చిన ఆయన.. చివరి రౌండ్లకు వచ్చే సమయానికి తన సమీప ప్రత్యర్థి లిజ్ ట్రస్‌ కంటే వెనుకబడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. 
 
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ యొక్క తదుపరి నాయకుడిగా తాను ప్రచారంలో అండర్ డాగ్‌గా తెరపైకి వచ్చారు. కానీ, ఈ రేస్ చివరి దశకు చేరుకునే సమయానికి ఆయన వెనుకబడిపోయారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే వరకు వ్యక్తిగత పన్నులను తగ్గించడాన్ని ఆలస్యం చేస్తామన్న తన వాగ్దానానికి అందరూ అంగీకరించలేదని మాజీ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ అంగీకరించారు. 
 
మరోవైపు, ఈశాన్య ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పన్నులను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆమెకు ఒక్కసారిగా మద్దతు అనూహ్యంగా పెరిగింది.