సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (16:06 IST)

విడాకుల కోసం కోర్టుకెక్కిన దర్శకుడు శ్రీనువైట్ల భార్య?

srinu vitla - rupa
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో జంట విడిపోనుంది. తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల సతీమణి రూప కోర్టు మెట్లెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన రూప ఫ్యాషన్ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపుకలిగిన ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు. ఆమెను శ్రీనువైట్ల వివాహం చేసుకున్నారు. ఇపుడు వీరిద్దరూ విడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. 
 
తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా శ్రీను వైట్ల కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అందుకే రూప తన భర్త నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. గతంలో ఒకసారి ఇదేవిధంగా ఆమె కోర్టుకెక్కింది. 
 
కానీ, ఆమె తల్లిదండ్రులు వారించడంతో సర్దుకుపోయింది. కానీ, ఈ దఫా మాత్రం రూప తాను నిర్ణయంపై గట్టిగా నిలబడి విడాకుల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై శ్రీను వైట్ల స్పందించాల్సివుంది. కాగా, వీరిద్దరూ గత నాలుగేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు.