గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (22:16 IST)

భార్యకు విడాకులు ఇవ్వనున్న శ్రీనువైట్ల?

rupa vaitla-srinu vaitla
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల విడాకులు తీసుకోబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఆయన తన భార్య రూపా వైట్లతో విడాకులు తీసుకోవడానికి నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసిన్నట్లు ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
 
ఇండస్ట్రీలో నీకోసం అనే సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయమైన ఈయన.. తన సినీ కెరీర్‌లో మంచి మంచి సినిమాలు తెరకెక్కించాడు. లాస్ట్‌గా డైరెక్షన్ చేసిన చిత్రం..అమర్ అక్బర్ అంటోనీ..ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 
 
తాజాగా శ్రీనువైట్ల తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నాడు అని తెలియగానే ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. అసలు ఎందుకు వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆరా తీయ్యగా,..ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి.