సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 ఏప్రియల్ 2017 (02:37 IST)

కిట్ బ్యాగ్ లేకపోతే మ్యాచ్‌నే వద్దనుకుంటారా.. ఆట ముఖ్యమా లేక స్పాన్సర్లా?

ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ లయన్స్ టీమ్‌లో ఒక పంచ్ హిట్టర్ అందుబాటులో లేకపోవడమే ఆ జట్టు ఓటమికి కారణమైందని వ్యాఖ్యానాలు చే్స్తున్నారు. వినడానికి ఎంత సిల్లీగా ఉన్నా ఇది వాస్తవం. గుజరాత్ లయన్స్ జట్టులో అత్యంత కీలక ఆ

క్రికెట్ వంటి సంభావ్యతలతో కూడిన గేమ్ మరొకటి ఉండదు. ఆ బ్యాట్స్‌మన్‌ని తీసుకుని ఇంటే గెలిచేవాళ్లమేమో.. ఈ బౌలర్ అందుబాటులో లేకే ఓడిపోయాం, సరైన  ఫీల్డర్ ఆ ప్లేస్‌లో లేక ఆటే చేజారిపోయింది వంటి డజన్ల కొద్ది వ్యాఖ్యానాలు క్రికెట్‌కు సంబంధించి వినివిస్తూనే ఉంటాయి. ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ లయన్స్ టీమ్‌లో ఒక పంచ్ హిట్టర్ అందుబాటులో లేకపోవడమే ఆ జట్టు ఓటమికి కారణమైందని వ్యాఖ్యానాలు చే్స్తున్నారు. వినడానికి ఎంత సిల్లీగా ఉన్నా ఇది వాస్తవం. గుజరాత్ లయన్స్ జట్టులో అత్యంత కీలక ఆటగాడు అరోన్ ఫించ్ కిట్ బ్యాగ్ లేక ఆటనుంచి తప్పుకున్నాడన్న విషయం షాక్ కలిగిస్తోంది. సొంత కిట్ బ్యాగ్ సకాలంలో తనవద్దకు చేరకపోవడంతో పించ్ ఆటనే వదులుకుని పెవిలియన్‌లో కూర్చున్న కారణంగా ముంబై గెలుపుకు దగ్గరయిందంటున్నారు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో గుజరాత్ లయన్స్ హిట్టర్ అరోన్ ఫించ్ ఓ వింత కారణంతో మ్యాచ్‌ కు దూరమయ్యాడు. వాంఖేడ్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ తుది జట్టులో ఫించ్ పాల్గొనకపోవడానికి కారణం అతని కిట్ బ్యాగ్. గత మ్యాచ్ ఆడిన రాజ్ కోట్ నుంచి అరోన్ ఫించ్ కిట్ బ్యాగ్ ముంబైకి చేరేలేదట. దాంతోనే ముంబైతో మ్యాచ్ నుంచి ఫించ్ తప్పుకున్నట్లు గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా వెల్లడించడం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. 
 
పైగా జట్టులోని సహచరుల కిట్ నుంచి బ్యాట్ తీసుకుని ఆడటానికి అవకాశమున్నప్పటికీ, అరోన్ ఫించ్ నిరాకరించడంతో మొత్తం మ్యాచ్‌కే దూరం కావాల్సి వచ్చిందని సమాచారం. సహచరుల కిట్ నుంచి బ్యాట్ తీసుకోకపోవడానికి వెనుక పెద్ద కథ ఉంది.  ఒకవేళ సహచరుల బ్యాట్‌తో ఆడిన క్రమంలో స్పాన్సర్ల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఫించ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడన్నది కారణ. 
 
అసలు విషయం ఏమిటంటే  ఆటగాళ్లు ఆడుతున్న బ్యాట్ పై కంపెనీ స్టిక్కర్లు వేసుకునేందుకు సదరు కంపెనీలు క్రికటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తాయి. ఈ క్రమంలోనే లేనిపోని తలపోటు తెచ్చుకోవడం కంటే మ్యాచ్ కు దూరంగా ఉండటమే మంచిదనే కారణంతోనే ఫించ్ అలా చేసి ఉండవచ్చని సమాచారం. 
 
ఇక్కడే ఆట అనేది ఆట కోసమా లేక స్పాన్సర్ల కోసమా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. తన ప్రమేయం లేకుండానే స్పాన్సరర్లు ఇచ్చిన కిట్ తనకు అందుబాటులో లేకుండా పోయినప్పుడు జట్టు ప్రయోజనాలకోసం ఇతరుల బ్యాట్ తీసుకుని ఆడటానికి బదులుగా ఆటనుంచే తప్బుకోవడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏమో అరోన్ ఫించ్ ఈ గేమ్ ఆడి ఉంటే గుజరాత్ లయన్ జట్టే గెలిచి ఉండేదేమో మరి.