శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 15 ఏప్రియల్ 2017 (08:43 IST)

కోహ్లీ అంత మాట అన్నా ఫర్వాలేదు. నేనెప్పుడూ భారత్ మిత్రుడినే: ఉబ్బేసిన వార్నర్

భారత క్రికెటర్లలో ఏ ఒక్కరితోనూ తనకు విభేదాలు లేవని, ఎల్లప్పుడూ భారత క్రికెటర్లకు మంచి మిత్రుడిగానే ఉంటానని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌, ఆస్ర్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నమ్రతతో చెప్పాడు. మైదానంలో ఎన్ని గొడవలైనా రావచ్చు. కానీ క్రికెటర్లు మాత

భారత క్రికెటర్లలో ఏ ఒక్కరితోనూ తనకు విభేదాలు లేవని, ఎల్లప్పుడూ భారత క్రికెటర్లకు మంచి మిత్రుడిగానే ఉంటానని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌, ఆస్ర్టేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ నమ్రతతో చెప్పాడు. మైదానంలో ఎన్ని గొడవలైనా రావచ్చు. కానీ క్రికెటర్లు మాత్రం చివరికి సానుకూల దృక్పథంతోటే ఆట ఆడతారని వార్నర్ తెలిపాడు. టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా కొంత వివాదం రేగినా.. మేమంతా ఎంతో సరదాగా ఉంటామని వార్నర్‌ చెప్పాడు.
 
వివాదాలను పక్కన బెడితే.. భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఎంతో అద్భుతంగా జరిగిందన్నాడు. సిరీస్‌ నెగ్గక పోవడం బాధగా ఉన్నా.. ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పాడు. ఇంగ్లండ్‌లో జరగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ ప్రతీ జట్టుకూ ఎంతో కీలకమన్నాడు. బిజీబిజీ క్రికెట్‌ ఆడుతున్న భారత్‌కు అయితే మరీ ముఖ్యమన్నాడు. 
 
కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇకపై తన మిత్రులు కాదని కూడా వ్యాఖ్యానించాడు. కానీ అంతిమంగా క్రికెటర్లు సానుకూల దృక్పథంతోనే ఆట ఆడతారని వార్నర్‌ అన్నాడు. ‘మేము చక్కగా కలసి పోతాం. మైదానంలోకి దిగినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. దేశం కోసం ఆడడం.. గెలవడమే లక్ష్యం. అందుకోసం ఏదైనా చేయడానికి సిద్ధమ’ని డేవిడ్‌ అన్నాడు.