గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (18:26 IST)

గ్లెన్ మ్యాక్స్‌వెల్ పెళ్లి వీడియో వైరల్ (video)

maxwell
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత సంతతికి చెందిన తన గర్ల్ ఫ్రెండ్ వినీ రామన్‌ను మ్యాక్సీ గతవారమే మెల్‌బోర్న్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, విని తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వాళ్లు కావడంతో ఈ జంట చెన్నైలో హిందు సంప్రదాయం ప్రకారం మరోసారి పెండ్లి వేడుక నిర్వహించింది. 
 
ఇందులో భాగంగా తమిళ ఆచారం ప్రకారం మ్యాక్సీ, విని డ్యాన్స్‌ చేస్తూ పెళ్లి దండలు మార్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కాగా, ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రూ. 11 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. తను తొందర్లోనే ఆర్‌సీబీ టీమ్‌లో చేరుతాడు.