శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (09:34 IST)

జియోకు ఎయిర్‌టెల్ చావుదెబ్బ... రూ.399తో న్యూ ప్లాన్

దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు అన్ని టెలికాం కంపెనీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోతున్నాయి. ముఖ్యంగా, జియోను కట్టడి చేసేందుకు ఎత్తుకుపైఎత్త

దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియోను దెబ్బతీసేందుకు అన్ని టెలికాం కంపెనీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైపోతున్నాయి. ముఖ్యంగా, జియోను కట్టడి చేసేందుకు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. అచ్చం జియోను పోలిన ప్రీపెయిడ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.399 రీచార్జ్‌తో రోజుకు 1జీబీ 4జీ డేటాను 84 రోజులపాటు అందించనున్నట్టు తెలిపింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్ అయినా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ 4జీ సిమ్‌తో 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లకు మాత్రమేనని వివరించింది.
 
అలాగే, రూ.399 రీచార్జ్‌తోపాటు రూ.244 ప్లాన్‌ను కూడా భారతీ ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటాను 70 రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు. అయితే వాయిస్ కాల్స్ మాత్రం ఎయిర్‌టెల్ పరిధిలోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దెబ్బకు రిలయన్స్ జియో దూకుడుకు బ్రేకులు పడతాయని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.