అమేజాన్‌కు భారీ నష్టం.. కస్టమర్లకు ఖుషీ ఖుషీ.. ఒక్క చిన్న తప్పు..?
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్లు.. ఒక్క చిన్న తప్పు అమేజాన్ కొంపముంచింది. భారీ నష్టాల పాలయ్యేలా చేసింది. రూ.లక్షలు చేసే కెమెరాను ఫోనును కేవలం రూ.6500కే విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా, ఫోను కోసం కస్టమర్లు ఎగబడి ఆర్డరిచ్చారు. ఇపుడు వీరందరికీ ఆ ఫోనును సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలు అమేజాన్ చేసిన చిన్న పొరపాటు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం. గత వారం అమెజాన్, ప్రైమ్ డే సేల్‌ను నిర్వహించింది. ఇందులో 13 వేల డాలర్లు (సుమారు రూ.9 లక్షలు) విలువైన ఓ కెమెరా రేటును 94 డాలర్లు (సుమారు రూ.6500) అని పొరపాటును ప్రకటించింది. ఈ ధరకే ఓ వినియోగదారుడు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే... ఒక్కసారిగా లక్షలాది మంది కస్టమర్లు ఆ కెమెరాను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.
అమేజాన్ టెక్నికల్ వైఫల్యంతో, ఫ్యుజి, కెనాన్, సోనీ వంటి కంపెనీల ఖరీదైన కెమెరాలు అతి తక్కువ ధరకు అమ్ముడయ్యాయి. రూ.3 వేల నుంచి 5 వేల డాలర్ల వరకూ ఉన్న కెమెరాలు, 100 డాలర్లకులోపే లభించాయి. దీనిపై స్పందించిన అమెజాన్, సైట్‌లో చోటుచేసుకున్న సాంకేతిక సమస్య కారణంగా ఈ తప్పు జరిగిందని తెలిపింది. ఇక వీరికి కెమెరాలను పంపిస్తారా? అన్న విషయమై సంస్థ ఇంకా ఏమీ తేల్చలేదు.