శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (15:32 IST)

అసుస్ జెన్‌ఫోన్ 3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసా?

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. అసుస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ 3 అల్ట్రా'ను తాజాగా విడుద‌ల చేసింది. దీని ధరను రూ.49,999గా నిర్ణయించింది. అలాగే, ఈ కంపెనీ విడ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. అసుస్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'జెన్‌ఫోన్ 3 అల్ట్రా'ను తాజాగా విడుద‌ల చేసింది. దీని ధరను రూ.49,999గా నిర్ణయించింది. అలాగే, ఈ కంపెనీ విడుదల చేసిన జెన్‌ఫోన్ 3 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధరలను పరిశీలిస్తే... ఇందులో జెన్‌ఫోన్ 3 (ZE520KL) ధరను రూ.21999గా నిర్ణయించింది. అలాగే, జెన్‌ఫోన్ 2 (ZE552KL) రూ.27,999గాను, జెన‌ఫోన్ 3 అల్ట్రా (ZU680KL) ధరను రూ.49,999గాను, జెన్‌ఫోన్ 3 లేజర్ (ZC551KL)ను రూ.18,999గా, జెన్‌ఫోన్ 3 డీలక్స్ (ZS570KL) ప్రారంభ ధరను రూ.49,999గాను  స్నాప్‌డ్రాగన్ 821 మోడల్ ధరను రూ.62,999గా ఖరారు చేసింది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. ఇందులోని ప్రత్యేకతలను పరిశీలిస్తే... 
 
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 అంగుళాల డిస్‌ప్లే, 1920 X 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 652 ప్రాసెస్సర్‌, అడ్రినో 510 గ్రాఫిక్స్, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ెల్ స్టోరేజ్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 23 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్, ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్‌-సి, 4600 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0 తదితర అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.