సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (09:07 IST)

బిల్ గేట్స్‌కు మైక్రోసాఫ్ట్ ఉద్యోగితో అలాంటి సంబంధం.. అందుకే..?

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బోర్డ్ మెంబర్స్ 2020లో తమ కో ఫౌండర్ బిల్ గేట్స్ మహిళా మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్ తో రొమాంటిక్ రిలేషన్ షిప్‌లో ఉండడం సరి కాదని చెప్పారు.
 
ఆదివారం నాడు ఆ బోర్డు మెంబర్లు 2019 దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయగా మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ లెటర్ లో ఆమె బిల్ గేట్స్ తో కొన్ని సంవత్సరాల నుంచి సెక్సువల్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ఉంది.
 
అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతున్నప్పుడే గేట్స్ రిజైన్ చేయడం జరిగింది. 20 ఏళ్ల నుండి కూడా వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతను రిజైన్ చేయడానికి కారణం ఇదే అని కూడా స్పోక్స్ పర్సన్ అన్నారు.
 
గత సంవత్సరం అతను మైక్రోసాఫ్ట్ బోర్డ్ వదిలేసినప్పుడు ఫిలంత్రోఫి మీద ఫోకస్ చేయడానికి వదిలేసినట్లు చెప్పారు. అయితే ఇటీవలే మెలిందా బిల్ గేట్స్ తమ 27 ఏళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేశారు. కానీ ఇంకా వాళ్ళిద్దరు ఛారిటీలో కలిసి పని చేస్తున్నారు.