బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్ ధర రూ.38 వేలు... ఏప్రిల్ నుంచి మార్కెట్‌లోకి...

blackberry
pnr| Last Updated: ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (15:07 IST)
బ్లాక్‌బెర్రీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ పేరు కీవన్. ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ తన ఇన్-హౌజ్‌లోనే తయారు చేసింది. దీని ధరను ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌కు ముందు లాంచ్ చేసిన ఈ ఫోన్ ధరను రూ.38,600గా పేర్కొంది.

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే 4.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ వెనుక, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కాగా 2 టీబీ వరకు పెంచుకునే సదుపాయం ఈ ఫోన్‌లో ఉండటం విశేషం. ఈ ఫోన్‌లో 3505 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఓఎస్‌తో పనిచేస్తుంది.దీనిపై మరింత చదవండి :