బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (14:46 IST)

#BSNL bumper offer: నెలకు రూ.249... రోజుకు 10జీబీ డేటా

ప్రభుత్వ టెలికాం రంగసంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు 249 రూపాయలు చెల్లిస్తే రోజుకు 10జీబీ డేటా పొందొచ్చని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు

దేశీయ టెలికాం రంగంలో ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ సేవలు చౌక ధరకే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తన వినియోగదారులకు జియో ప్రకటిస్తున్న ఆఫర్లతో ఇతర టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో ఆ కంపెనీలు కూడా ధరలను విపరీతంగా తగ్గించడమే కాకుండా, ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
 
ఈ కోవలో ప్రభుత్వ టెలికాం రంగసంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు 249 రూపాయలు చెల్లిస్తే రోజుకు 10జీబీ డేటా పొందొచ్చని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, ప్రతి ఆదివారం అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. 
 
అన్‌లిమిటెడ్ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ కింద కనెక్షన్ పొందేవారికి ఇంటర్నెట్ స్పీడ్ మినిమమ్ 2ఎంబీపీఎస్‌గా ఉంటుంది. పైగా ఈ మంత్లీ ప్యాక్ ధర... దాని ప్రయోజనాలు జియో ప్రకటించిన 303 రూపాయల ప్లాన్ కంటే మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.