రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్-రూ.243కి అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బాండ్

రిలయన్స్ జియో దెబ్బకు టెలికామ్ రంగానికి చెందిన సంస్థలన్నీ ఏకమయ్యాయి. టెలిఫోన్‌ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్‌డీఈ ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు

bsnl logo
Selvi| Last Updated: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (09:42 IST)
రిలయన్స్ జియో దెబ్బకు టెలికామ్ రంగానికి చెందిన సంస్థలన్నీ ఏకమయ్యాయి. టెలిఫోన్‌ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్‌డీఈ ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు.

రూ.49లకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ అందిస్తున్నామని.. రూ.243లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అన్‌ లిమిటెడ్‌ బ్రాండ్‌ బాండ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రకాష్ కుమార్ వెల్లడించారు.

మార్చి 31వతేదీ వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్‌ చార్టీలు ఉండవని, ఈ అవకాశాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇప్పటికే కల్పించగా, ప్రతి నెలలో వచ్చే అన్ని ఆదివారాలు పూర్తి ఉచితం చేశామన్నారు.దీనిపై మరింత చదవండి :