జియో ఎఫెక్ట్‌‌తో బీఎస్ఎన్‌ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.. రూ.249 చెల్లిస్తే 10జీబీ డేటా

జియో ఎఫెక్ట్‌తో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. దేశంలో వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కింద రోజుకు 10 జిబి డేటాను అందిస్తున్నట్లు బీఎస్ఎన్

bsnl logo
Selvi| Last Updated: శనివారం, 1 ఏప్రియల్ 2017 (10:18 IST)
జియో ఎఫెక్ట్‌తో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. దేశంలో వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల కింద రోజుకు 10 జిబి డేటాను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. 2 ఎంబిపిఎస్‌ స్పీడ్‌, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి249 పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

ప్లాన్‌లో భాగంగా నెలకు 249 రూపాయలు చెల్లించటం ద్వారా రోజుకు 10 జిబి డేటాను వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. డేటా డౌన్‌లోడ్‌కు అదనంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపింది. నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు. అలాగే ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఆదివారం రోజు మొత్తం అపరిమిత కాల్స్ చేయొచ్చు.దీనిపై మరింత చదవండి :