బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (21:25 IST)

విమానాలెందుకు? ఎలెన్ మస్క్ ఐడియా.. ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోకు 30 నిమిషాలే.. ఎలా?

elon musk
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల మధ్య ప్రయాణాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రయాణ సరిహద్దులను పెంచాలని చూస్తోంది. అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉన్నత స్థానాన్ని ఇవ్వనుండటంతో టెక్ బిలియనీర్ అయిన మస్క్ తన ప్రాజెక్ట్‌కి ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్ పొందినట్టేనని హ్యాపీగా వున్నారు. 
 
స్టార్‌షిప్, స్పేస్ ఎక్స్ 395-అడుగుల స్టెయిన్‌లెస్ స్టీల్ రాకెట్, గరిష్ట వేగంతో 1,000 మంది ప్రయాణికులతో జర్నీ చేసేందుకు రూపొందించబడింది. సాంప్రదాయ విమానాలకు బదులుగా, రాకెట్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇది భూమి ఉపరితలంతో సమాంతరంగా నడుస్తుంది, ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వంటి గమ్యస్థానాలకు కేవలం 30 నిమిషాల్లో చేరుకుంటుంది.
 
ఇంకా టెస్లా సీఈవో ఈ "భూమి నుండి భూమికి" అంతరిక్ష యాత్రను ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోవడంతో రియాలిటీగా మార్చడానికి సిద్ధం అవుతోంది. ఓ ఎక్స్ వినియోగదారుకు సమాధానంగా ఈ విషయాన్ని మస్క్ ధృవీకరించినట్లుగా తెలుస్తోంది. ఇంకా మస్క్ తనన కలల ప్రాజెక్ట్‌కు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుండి ఆమోదం పొందే అవకాశం ఉంది. 
 
ఇది ఒక సంచలనాత్మక ఆవిష్కరణ అయినప్పటికీ పర్యావరణ, భద్రతా సమస్యలు దీనికి జోడించబడ్డాయి. అంతరిక్ష నౌక కక్ష్యలోకి ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణీకులు విమానం మధ్యలో తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితులను ఎదుర్కొంటారు. మస్క్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి టైమ్‌లైన్ లేదా నిర్ధారణను ఇవ్వలేదు.