గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (12:25 IST)

ఎలాన్ మస్క్ సైబర్ ట్యాక్సీ ఇదే.. ఎంతమంది ప్రయాణం చేయొచ్చు?

robobus
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేసిన సైబర్ ట్యాక్సీ సిద్ధమైంది. టెస్లా వీరోబో షోలో కొత్త వాహనాలను ప్రదర్శించారు. ఇందులో ఈ సైబర్ ట్యాక్సీని కూడా ప్రదర్శించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థ రూపొందించిన రోబో వ్యాన్‌ను వీరోబో (రోబోట్ ఈవెంట్) కార్యక్రమంలో హఠాత్తుగా ప్రదర్శించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ఈ షోను నిర్వహించారు. రోబోవ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తి భిన్నంగా ఉంది. అది రైలు ఇంజిన్ వంటి డిజైన్‌‍లో దానిని రూపొందించారు. దీని చక్రాలు బయటకు కనిపించకపోవడం విశేషం. దీన్ని 20 మంది ప్రయాణికులను లేదా సరకులను తరలించేందుకు వాడొచ్చని సంస్థ తెలిపింది. 
 
ఈ వ్యాను మైలుదూరం ప్రయాణించడానికి 5 నుంచి 10 సెంట్ల ఖర్చు అవుతుందని టెస్లా బృందం పేర్కొంది. దీనిని అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం నిర్మించినట్టు వెల్లడించింది. దీంతో టెస్లా మాస్ ట్రావెల్ సెగ్మెంట్లలో కూడా ఇది ప్రవేశించనట్టయింది. ఇప్పటివరకు ఈ సంస్థ వాహనాల లైనప్ కేవలం చిన్నవాటికే పరిమితమైంది. 
 
ఇక రోబో ట్యాక్సీని కూడా ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేవు. దానిని మస్క్ క్యాబ్ అని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీని తయారీ 2026 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. దీనిని వినియోగదారులు 30 వేల డాలర్ల కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రతీ మైలు ప్రయాణానికి 20 సెంట్లు ఖర్చవుతుందని, అటానమస్ కార్లను సాధారణంగా వాహనాల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా వాడొచ్చని మస్క్ వెల్లడించారు.