ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (11:50 IST)

బ్లూమూన్ అద్భుతం.. ఎలోన్ మస్క్ ట్వీట్

supermoon
supermoon
బిలియనీర్ ఎలోన్ మస్క్ మంగళవారం నాడు 2024 మొదటి సూపర్‌మూన్‌ని ‘అద్భుతం’ అంటూ పేర్కొన్నారు. సోమవారం నుండి బుధవారం వరకు, "పూర్ణ చంద్రుడిని సూపర్‌మూన్, బ్లూ మూన్"గా చూడవచ్చు, అని నాసాలో ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో బ్లూమూన్ గురించి ఎలెన్ మస్క్ మాట్లాడుతూ.."చంద్రుడు అద్భుతంగా కనిపిస్తున్నాడు" అని పోస్ట్‌లో తెలిపారు.
 
భారతదేశం, ఆస్ట్రేలియాతో సహా ఆసియా అంతటా నేపాల్ నుండి తూర్పు వైపు ఉన్నవారికి చంద్రుడు అందంగా కనిపిస్తాడు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడే సూపర్‌మూన్ ఏర్పడుతుందని నాసా తెలిపింది.