గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (11:27 IST)

ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో ఎలాన్ మస్క్ లవ్వాయణం

Elon Musk
Elon Musk
ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ డేటింగ్‌లో వున్నట్లు తెలుస్తోంది. ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్ నగరంలో జరిగిన "అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డు" కార్యక్రమంలో మస్క్ మెలోనీపై ప్రశంసలు కురిపించారు. 
 
ఇక తనను అంతలా పొడగిన మస్క్‌కు ఎక్స్ వేదికగా మెలోనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. టెస్లా ఫ్యాన్ క్లబ్ ఒక ఫొటోను పోస్ట్ చేసి... "వాళ్లు డేటింగ్ చేస్తారని మీరు భావిస్తున్నారా? అని నెటిజన్ల అడిగింది. దీనిపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. "డేటింగ్ చేయడం లేదు" అని సమాధానం ఇచ్చారు.