జుకర్‌బర్గ్‌నే చంపేసిన ఫేస్ బుక్... మామూలు యూజర్లను చంపడం ఓ లెఖ్ఖా...?

సామాజిక నెట్వర్కింగ్ సైట్లు అప్పుడప్పుడు తలకాయ లేని పనులు చేస్తుంటాయన్న సంగతి చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. అలాంటిదే ఫేస్ బుక్ ఒకటి చేసేసింది. ఏదో చేయాలనుకుని మరేదో చేసేసింది. ఇంతకీ అది చేసింది ఏంటయా అంటే... తనకున్న యూజర్లలో భారీ సంఖ్యలో యూజర్లు చనిపో

ZukerBurg
ivr| Last Modified శనివారం, 12 నవంబరు 2016 (12:47 IST)
సామాజిక నెట్వర్కింగ్ సైట్లు అప్పుడప్పుడు తలకాయ లేని పనులు చేస్తుంటాయన్న సంగతి చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. అలాంటిదే ఫేస్ బుక్ ఒకటి చేసేసింది. ఏదో చేయాలనుకుని మరేదో చేసేసింది. ఇంతకీ అది చేసింది ఏంటయా అంటే... తనకున్న యూజర్లలో భారీ సంఖ్యలో యూజర్లు చనిపోయినట్టు నిర్థారించేసింది. శుక్రవారం నాడు వారు చనిపోయినట్లు నిర్థారిస్తూ పోస్టులు చేసింది. విచిత్రం ఏమిటంటే.. ఈ జాబితాలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ పేరు కూడా ఉండటమే.

శుక్రవారం పొరపాటుగా నిర్ధారించారు. వీరిలో ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జూకర్‌బర్గ్‌ పేరు కూడా ఉంది. జుకర్ బర్గ్‌నే చంపేసిన ఫేస్ బుక్... మామూలు యూజర్లను చంపడం ఓ లెఖ్ఖా...? అని కొందరు యూజర్లు అంటుంటే మరికొందరు ఫేస్ బుక్ వారు చేసింది తలకాయ లేని పని అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు.

ఐతే తాము చేసింది చాలా పెద్ద పొరబాటనీ, సరిదిద్దుకుంటామని ఫేస్ బుక్ యాజమాన్యం యూజర్లను అనునయిస్తోంది. ఏదేమైనా చనిపోయిన వారి స్మారక ప్రొఫైల్స్‌ను ఇతర ఎకౌంట్లలో పోస్ట్‌ చేసిన ఫేస్ బుక్ తీరును యూజర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే... మరణవార్త అత్యంత విషాదకరమైనది కదా..!దీనిపై మరింత చదవండి :