శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (10:34 IST)

రింగింగ్ బెల్స్ డైరక్టర్ మోహిత్ గోయల్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

గతేడాది ఫిబ్రవరిలో ఫ్రీడమ్ 251 అమ్మకాలను తమ వెబ్‌సైట్ ద్వారా రింగింగ్ బెల్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అతితక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్‌లో ప్రచారం చేసింది. ఫోన్

గతేడాది ఫిబ్రవరిలో ఫ్రీడమ్ 251 అమ్మకాలను తమ వెబ్‌సైట్ ద్వారా రింగింగ్ బెల్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అతితక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ అంటూ సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్‌లో ప్రచారం చేసింది. ఫోన్ కోసం ఏకంగా ఏడు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రింగింగ్ బెల్స్ కంపెనీ డైరక్టర్ మోహిత్ గోయల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ప్రకటిస్తామని ప్రకటన చేసిన సంస్థ డైరక్టర్‌‍పై ఘజియాబాద్‌కు చెందిన అయామ్ ఎంటర్‌ప్రైజెస్ ఓనర్ కేసు పెట్టడంతో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? ఫ్రీడమ్ 251 డీలర్‌షిప్ కోసం ఈ ఎంటర్‌ప్రైజెస్ నుంచి 2015లో రూ.30 లక్షలు వసూలు చేసింది. దీనికి సంబంధించి రూ.14 లక్షలు విలువ గల ఫోన్లను మాత్రమే ఈ డీలర్‌కు రింగింగ్ బెల్స్ అందజేసింది. మిగిలిన రూ.16లక్షలకు సంబంధించిన ఫోన్లను ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోయల్‌ని అరెస్ట్ చేశారు.