శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:39 IST)

ఫోటో యాప్‌‌లతో జాగ్రత్త.. రీడ్ చేశాయో.. ఇక చోరీనే.. 29 యాప్‌‌లకు గూగుల్ చెక్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకునే పలు అప్లికేషన్స్ ద్వారా మన వ్యక్తిగత వివరాలు చోరీకి గురవుతున్నాయని ఇటీవల తెలియవచ్చిన సంగతి తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లను ఫోనుల్లో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ముందుగానే... మన మొబైల్ ఫోన్లలో వుండే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో కూడిన డేటాను రీడ్ చేసేందుకు అనుమతి అడుగుతుంది. 
 
అందుకు మనం ఓకే చేస్తే.. ఇక మన డేటా చోరీకి గురైనట్లే. యాప్ ఇన్‌స్టాల్‌కు అనుమతి అడుగుతుందనుకుంటే.. మన డేటా చోరీకి అదే అనుమతి మార్గం అవుతుంది. యాప్ డెవలపర్లు ఈలాగే ఫోన్ల నుంచి డేటాను చోరీ చేస్తారని ఇటీవల షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఫోటో యాప్‌లు మరీ ప్రమాదం. 
 
ఈ యాప్ కోసం ఇన్‌స్టాల్ చేసుకుంటే.. మన ఫోటోలను రీడ్ చేసి.. ఆపై వాటిని చోరీ చేసి.. మార్ఫింగ్ చేసి.. ఇతర సైట్లలో ఉపయోగించుకుంటుంది. ఆ ఫోటోలను ఇతర సైట్లకు అప్ లోడ్ చేసి పరోక్షంగా డబ్బులు సంపాదించుకుంటారు. ఈ యాప్‌ల సంగతిని గమనించిన గూగుల్.. దాదాపు 29 యాప్‌లను ఉన్నట్టుండి ప్లేస్టోర్ నుచి తొలగించింది. తద్వారా వినియోగదారుల డేటాను చోరీ చేసే యాప్‌లకు చెక్ పెట్టింది.