శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2016 (12:47 IST)

గూగుల్ ఫోన్ హ్యాక్ అయ్యింది.. కేవలం 60 సెకన్లలోనే.. రూ.81లక్షల రివార్డ్..

గూగుల్ ఫోన్‌కు హ్యాకింగ్ తప్పలేదు. గూగుల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన పిక్సెల్‌ ఫోన్‌ను చైనీస్‌ హ్యాకర్లు హ్యాక్‌ చేసేశారు. కేవలం 60 సెకన్లలోనే. ఈ ఫోన్‌ను మాత్రమే కాకుండా.. యాపిల్‌ సఫారీ బ్రౌజర్‌..

గూగుల్ ఫోన్‌కు హ్యాకింగ్ తప్పలేదు. గూగుల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన పిక్సెల్‌ ఫోన్‌ను చైనీస్‌ హ్యాకర్లు హ్యాక్‌ చేసేశారు. కేవలం 60 సెకన్లలోనే. ఈ ఫోన్‌ను మాత్రమే కాకుండా.. యాపిల్‌ సఫారీ బ్రౌజర్‌.. అడోబ్‌ ఫ్లాష్‌ సాఫ్ట్‌వేర్లలోనూ సాంకేతిక లోపాలను వెలికితీసి అందరూ షాక్ అవుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే దిగ్గజ సంస్థల నుంచి కోట్ల రూపాయల రివార్డులు కొల్లగొట్టేశారు. 
 
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈ శుక్రవారం జరిగిన 'పీడబ్ల్యూఎన్‌ఫెస్ట్‌' హ్యాకింగ్‌ పోటీల్లో చైనా నిపుణులు సత్తా చాటారు. 'కిహూ 360' అనే హ్యాకర్ల బృందం.. గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌లో కేవలం 60సెకన్లలోనే ఓ లోపాన్ని ఎత్తిచూపించింది. ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని పిక్సెల్‌ ఫోన్లలో రిమోట్‌గా కోడ్‌ను రన్‌ చేసే వీలుందని వేదికపై చూపించారు. దాంతో ఆ బృందానికి 1,20,000 డాలర్ల(రూ.81లక్షలు) రివార్డును గూగుల్‌ ఇవ్వనుంది. 
 
ఆ హ్యాకర్లే 'అడోబ్‌ ఫ్లాష్‌' సాఫ్ట్‌వేర్‌లోనూ లోపం ఉన్నట్లు కేవలం 4 సెకన్లలోనే బయటపెట్టారు. అందుకు అడోబ్‌ సంస్థ నుంచి 1,20,000 డాలర్లు కొట్టేశారు. అలా 'కిహూ 360' టీంకు చెందిన హ్యాకర్లు మొత్తం 5లక్షల 20వేల డాలర్లు(దాదాపు రూ.3.5కోట్లు) రివార్డులు పట్టుకెళ్లారని 'ది రిజిస్టర్‌' అనే మీడియా సంస్థ తెలిపింది.