ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (15:45 IST)

బెంగళూరులో రూ.1,100 కోట్ల పెట్టుబడి-ఇంటెల్ నుంచి 18 మాసాల్లో 3వేల ఉద్యోగాలు

బెంగళూరులో చిప్ తయారీలో పేరొందిన ఇంటెల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటెల్ కంపెనీ సబ్సిడరీలో దాదాపు ఆరువేల మందికి పైగా టెక్కీ గ్లోబల్ కస్టమర్ల కోసం పనిచేస్తున్న నేపథ్య

బెంగళూరులో చిప్ తయారీలో పేరొందిన ఇంటెల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటెల్ కంపెనీ సబ్సిడరీలో దాదాపు ఆరువేల మందికి పైగా టెక్కీ గ్లోబల్ కస్టమర్ల కోసం పనిచేస్తున్న నేపథ్యంలో బెంగళూరులో.. కొత్తగా ఏర్పాటుచేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్‌లో రూ.1,100 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఇంటెల్ ప్రకటించింది. తద్వారా మూడువేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ సెంటర్ ద్వారా వచ్చే 18 మాసాల్లో కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 
 
ఎనిమిది ఎకరాల క్యాంపస్‌లో ఈ కొత్త ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఇంటెల్ ఏర్పాటు చేస్తోంది. కంప్యూటర్ సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ హర్డ్ వేర్ సర్వీస్ సౌకర్యాలను కూడ ఇక్కడే కల్పించనుంది. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ హర్డ్ వేర్ డిజైన్, టెస్టింగ్ కంప్యూటర్ల హార్డ్ వేర్ వాలిడేషన్ తర్వాతి తరం డిజిటల్ డివైజ్‌లకు సాఫ్ట్ వేర్ ఉత్పత్తులపై కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఇంటెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.