ఐఫోన్ కస్టమర్లకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్.. 15 నెలలు ఫ్రీ సేవలు
ప్రైవేట్ టెలికాం రంగంలో సంచనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో (ఆర్‌జియో) మరో సంచలనానికి తెరతీసింది. యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా 15 నెలల పాటు ఆ
ప్రైవేట్ టెలికాం రంగంలో సంచనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో (ఆర్‌జియో) మరో సంచలనానికి తెరతీసింది. యాపిల్ ఐఫోన్ వినియోగదారులకు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా 15 నెలల పాటు ఆర్‌జియో సర్వీసులన్నీ ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటును కల్పించనుంది.
ప్రస్తుతం రిలయన్స్ జియో అందిస్తున్న వెల్‌కమ్ ప్లాన్ డిసెంబర్ 31తో ముగియనుంది. ఆ తర్వాత వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఐఫోన్ వినియోగదారులందరూ ఉచిత పథక ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సర్వీసుల్లో భాగంగా, ఒక యేడాదిపాటు ఉచిత వాయిస్ కాల్స్, 20 జిబి డేటా, అపరిమిత ఎస్‌ఎంఎస్ సర్వీసులు కూడా కలిసి ఉన్నాయి. వీటి విలువ 18,000 రూపాయలు.
అయితే, దీనికో షరతు పెట్టింది. కేవలం రిలయన్స్ రిటైల్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా ఐఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లు డిసెంబర్ 31 వరకు వెల్‌కమ్ ఆఫర్‌ను ఉచితంగా పొందుతారు. జనవరి ఒకటో తేదీ నుంచి వీరంతా 1,499 రూపాయల ప్లాన్‌ను పూర్తి ఉచితంగా యేడాది పాటు పొందుతా రు. ఈ ప్లాన్ కింద వీరికి 18,000 రూపాయల విలువైన సర్వీసులను అందుకుంటారు.
అలాగే, 1,499 రూపాయల ప్లాన్‌లో భాగంగా అపరిమిత లోకల్, ఎస్‌టిడి వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్, 20 జిబి వరకు 4జి డేటా, రాత్రి అపరిమిత 4జి డేటా, 40జిబి వైఫై డేటా, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత జియోయాప్స్ లభిస్తాయి. జియో ఇచ్చే ఆఫర్ ఐఫోన్ 7, 7 ప్లస్ కస్టమర్లకే కాకుండా ఐఫోన్ 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్, ఎస్‌ఇ వినియోగదారులు పొందవచ్చు.