ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (18:31 IST)

జీఎస్టీసేల్.. వినియోగదారులకు పండగే పండగ.. రూ. లక్ష టీవీ రూ.60 వేలకేనా?

జీఎస్టీ ప్రభావంతో వినియోగదారుల పంట పండుతోంది. బిగ్ బజార్ నుంచి అమేజాన్ వరకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. క్లియరన్స్ కోసం సదరు సంస్థలు రిటైలర్లకు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

జీఎస్టీ ప్రభావంతో వినియోగదారుల పంట పండుతోంది. బిగ్ బజార్ నుంచి అమేజాన్ వరకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. క్లియరన్స్ కోసం సదరు సంస్థలు రిటైలర్లకు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బజార్ 30వ తేదీ అర్థరాత్రి నుంచి 22 శాతం తగ్గింపుతో విక్రయాలు ప్రారంభించనుండగా.. బుధవారం రాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ప్రారంభించనుంది. 
 
అమెజాన్ ఇప్పటికే 40-50 శాతం రాయితీతో ప్రి-జీఎస్‌టీ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల విలువైన టీవీని కేవలం రూ.60 వేలకే అందించనున్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ కారణంగా మార్జిన్ తగ్గడం, తద్వారా లాభాలు తగ్గే అవకాశం ఉండడంతో మేల్కొన్న రిటైలర్లు తమ వద్ద ఉన్న స్టాక్‌ను ఇలా ఆఫర్ల పేరుతో క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇన్‌ఫినిటీ రిటైలర్ సంస్థ చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ రితేష్ ఘోషల్ తెలిపారు.
 
క్రోమా వంటి షాపుల్లో వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు లభించనున్నాయి. ఆరునెలలపాటు గల స్టాక్‌లను ఈ జీఎస్టీ సేల్ ద్వారా క్లియర్ చేసేందుకు సంస్థలు రెడీ అయినట్లు రితేష్ వెల్లడించారు. జీఎస్టీ సేల్‌తో వినియోగదారులపై ఆఫర్ల జడివాన కురుస్తోందని రితేష్ చెప్పారు.