రిలయన్స్‌ జియో మరో సంచలనం?.. త్వరలో ఐపీ టీవీ ప్రసారాలు

పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు.. రిలయన్స్ జియో త్వరలోనే ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీ టీవీ) ప్రసారాలను

iptv
pnr| Last Updated: సోమవారం, 3 ఏప్రియల్ 2017 (10:55 IST)
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో లీకైన సమాచారం మేరకు.. రిలయన్స్ జియో త్వరలోనే ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీ టీవీ) ప్రసారాలను ప్రారంభించబోతున్నట్టు సమాచారం. అయితే, లీకేజీపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

కానీ, తాజాగా ఆన్‌లైన్‌లో లీకైన సెట్‌టాప్‌ బాక్స్‌ను నిశితంగా పరిశీలిస్తే మాత్రం రిలయన్స్ జియో త్వరలో ఐపిటీవీ సేవల రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సెట్‌టాప్‌ బాక్సులు ఉచితంగా అందించడంతో పాటు, డిటిహెచ్‌ ఆపరేటర్ల కంటే 40-50 శాతం చౌకగా ఐపిటీవీ ప్రసారాలు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

ఈ ఊహాగానాలు నిజమైతే... దేశీయ టెలికాం రంగంలో మాదిరిగానే డిటిహెచ్‌ రంగంలోనూ పెద్ద కుదుపు తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో ఐపీ టీవీ ప్రసారాలు ప్రారంభమైతే డీటీహెచ్ ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :