బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట అపరిమిత కాల్స్..

జియో ఎఫెక్ట్‌తో ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కేవలం రూ.49కే అపరిమిత కాల్స్ సదుపాయం కల్పిస్తోంది. ల్

bsnl logo
Selvi| Last Updated: మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:04 IST)
జియో ఎఫెక్ట్‌తో ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కేవలం రూ.49కే అపరిమిత కాల్స్ సదుపాయం కల్పిస్తోంది. ల్యాండ్ లైన్ కస్టమర్లను పెంచుకోవడానికి 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట కొత ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు అన్ని ఆదివారాల్లో 24 గంటల పాటు, మిగతా రోజుల్లో రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఫిక్స్‌డ్ నెల ఛార్జి అని, ఆరు నెలల పాటు దీనికి వ్యాలిడిటీ ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఆఫర్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ సిమ్ కార్డు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, రెండు రోజుల క్రితం 3జీ 1జీబీ డేటా రూ.36కే అందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :