శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (20:23 IST)

రిలయన్స్ జియో నుంచి త్వరలోనే డెబిట్ కార్డులు

jioservice
రిలయన్స్ జియో త్వరలోనే డెబిట్ కార్డులు తీసుకురానుంది. ఇప్పటికే సేవింగ్స్ అకౌంట్లు, బిల్ పేమెంట్ సేవలు అందిస్తున్న జియో కంపెనీ పేమెంట్స్ బ్యాంక్ విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డెబిట్ కార్డులు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు, వాహన రుణాలు, గృహ రుణాలు కూడా మంజూరు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.  
 
టెలికాం రంగంలో అడుగుపెట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన జియో ఆ తర్వాత వినోదం, రిటైల్ అమ్మకాల వైపు కూడా అడుగులు వేసింది. పేమెంట్స్ రంగంలో ఇప్పటికే అడుగుపెట్టిన జియో తాజాగా డెబిట్ కార్డులను తీసుకురానుంది.