శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (23:37 IST)

పెట్టుబడిదారుల కోసం.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. బ్లాక్ రాక్ డీల్

Jio
Jio
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్ రాక్ కలిసి దేశంలోని మిలియన్ల మంది పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలకు సాంకేతికతో కూడిన ప్రాప్యతను అందించేందుకు డీల్ కుదుర్చుకుంది. 
 
భారతదేశంలోని అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను డిజిటల్-ఫస్ట్ ఆఫర్‌ల ద్వారా మార్చడం, భారతదేశంలో పెట్టుబడిదారుల కోసం పెట్టుబడి పరిష్కారాలకు ప్రజాస్వామ్యీకరించడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని జియో ప్రకటించింది. 
 
ఈ జాయింట్ వెంచర్‌లో, బ్లాక్‌రాక్ ఇంక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 50 శాతంగా ఉంటుంది. డిజిటల్ ఫస్ట్ ఆఫర్ ద్వారా భారతదేశంలోని పెట్టుబడిదారుల కోసం అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను సరళీకృతం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని జియో వెల్లడించింది. 
Jio
Jio
 
జాయింట్ వెంచర్‌కు సంబంధించి ఇద్దరు భాగస్వాములు US$ 150 మిలియన్ల ప్రారంభ ప్రణాళికపై పని చేస్తారు. రెగ్యులేటరీ, చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాత జాయింట్ వెంచర్ కార్యకలాపాలను ప్రారంభిస్తాయి.