శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (22:20 IST)

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్: లాంగ్ వ్యాలిడిటీ ఆఫర్ ఇదే..

jioservice
రిలయన్స్ జియో లాంగ్ వ్యాలిడిటీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా జియో కస్టమర్లకు అధిక లాభాలను జియో అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ హై స్పీడ్ డేటాతో పాటుగా 75 GB అధిక డేటా వంటి మరిన్ని ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌తో పొందవచ్చు.  
 
జియో యొక్క రూ.2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా నెల రోజులకు లెక్కకడితే నెలకు 230 రూపాయలు మాత్రమే అవుతుంది. అలాగే రూ.2,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ద్వారా అన్ని నెట్వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్‌ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. 
 
అదనంగా, మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 75GB డేటాని కూడా జతచేసింది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. జియో అన్ని యాప్స్‌కి కూడా ఉచిత యాక్సెస్‌ను తీసుకువస్తుంది. 
 
జియో 6వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ప్లాన్‌తో 499 రూపాయల విలువైన డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్‌ను కూడా యాడ్ చేసింది. ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా గొప్ప లాభాలను అందిస్తుంది. 
 
ఈ ప్లాన్ Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్‌ను ఉచితంగా అఫర్ చేస్తుంది. అంటే, ఈ ప్లాన్ దాదాపుగా ఉచితంగా లభించినట్లే అవుతుంది.