శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2016 (09:58 IST)

ట్రాయ్ ఆదేశాలు బేఖాతర్.. ఖాతాదారులకు అభయమిచ్చిన జియో

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాలను బేఖాతర్ చేసిన రిలయన్స్ జియో.. ఖాతాదారులకు అభయమిచ్చింది. ‘వెల్‌కమ్ ఆఫర్’తో మార్కెట్‌ను ఏలుతున్న జియో తాము అందిస్తున్న ఉచిత ఆఫర్‌ను ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాలను బేఖాతర్ చేసిన రిలయన్స్ జియో.. ఖాతాదారులకు అభయమిచ్చింది. ‘వెల్‌కమ్ ఆఫర్’తో మార్కెట్‌ను ఏలుతున్న జియో తాము అందిస్తున్న ఉచిత ఆఫర్‌ను ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’ పేరుతో మరో 90 రోజులు పొడిగించింది. అయితే ఆఫర్ పొడిగింపు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) దీనిపై వివరణ ఇవ్వాలని రిలయన్స్‌ను కోరింది. దీంతో స్పందించిన రిలయన్స్.. జియో ఆఫర్లపై వివరణ ఇచ్చింది. 
 
తాము ప్రకటించిన రెండు ఆఫర్లు వేర్వేరని, ఈ రెండు ఒకదాని కిందకు రావని తేల్చి చెప్పింది. వెల్‌కమ్ ఆఫర్‌లో 4జీ డేటా పరిమితి ముగిసినా రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదని, కానీ న్యూఇయర్ ఆఫర్‌లో డేటా పరిమితి ముగిసిన తర్వాత కావాలనుకుంటే రీచార్జ్ చేసుకునే వెసులుబాటు ఉందని ట్రాయ్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొంది. 
 
హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ విషయంలో ట్రాయ్ నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించలేదని, ఆ నిబంధనలకు అనుగుణంగానే ఆఫర్ ప్రకటించామని ఈనెల 20న ట్రాప్ పంపిన లేఖకు సమాధానంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో పేర్కొంది. హ్యా న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31 వరకు కొనసాగుతుందని ఖాతాదారులకు అభయమిచ్చింది.