శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (15:34 IST)

ఆధార్, పాన్ అనుసంధానానికి 31వ చివరి తేదీ.. అలా చేయించకపోతే పాన్..?

ఆధార్, పాన్ అనుసంధానానికి చివరి తేదీ ఈ నెల 31. ఈ గడువులోగా వీటిని అనుసంధానం చేయించకపోతే పాన్ చెల్లదు. అంతేకాకుండా రూ.1,000 వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. లోక్‌సభ మంగళవారం ఆమోదించిన ఆర్థిక బిల్లు, 2021లో ఈ నిబంధనలు ఉన్నాయి. 
 
ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్‌ సంఖ్యను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా కోరినపుడు, ఆ వ్యక్తి ఆ విధంగా తన ఆధార్ సంఖ్యను తెలియజేయడంలో విఫలమైతే, గరిష్ఠంగా రూ.1,000 వరకు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా రుసుమును విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ బిల్లులో సెక్షన్ 234హెచ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. 
 
మార్చి 31నాటికి ఆధార్, పాన్‌లను తప్పనిసరిగా అనుసంధానం చేయించుకోవాలి. ఆధార్‌ను మెయింటెయిన్ చేయకపోతే పాన్ పని చేయదు. ఫలితంగా ఎదుర్కొనవలసిన పర్యవసానాలకు అదనంగా ఈ రుసుమును చెల్లించాలి. రూల్ 114ఏఏఏ ప్రకారం, పాన్‌ను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి పాన్ పనిచేయని స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించలేదని పరిగణిస్తారు.