Biodata Maker
✕

లాక్‌డౌన్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి ఎంటీఎన్ఎల్ గుడ్ న్యూస్

Written By సెల్వి
Updated: గురువారం, 26 మార్చి 2020 (18:34 IST)
లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ ఎంటీఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి  నెల రోజులపాటు ఉచిత డేటా అందిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.

ఆఫీసులో చేసే అన్ని పనులను ఇంటి పట్టున ఉండి చేసుకునే సౌలభ్యం ఈ ఉచిత డేటా ద్వారా లభిస్తుందన్నారు. ఈ విషయంలో యాక్సెస్ లిమిటేషన్స్ ఏమీ ఉండవని స్పష్టం చేశారు. ఇందుకోసం అదనంగా ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమన్నారు.
 
ఎంటీఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు కలిగిన ఆయా సంస్థల ఉద్యోగులు ఎంటీఎన్ఎల్ వీపీఎన్ఓబీబీ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఓవర్ బ్రాడ్‌బ్యాండ్)తో ఎనేబుల్ కావొచ్చని ప్రకటించారు.

వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఓవర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా తమ కార్యాలయ సర్వర్లను యాక్సెస్ చేసుకోవచ్చని చెప్పారు. ఇది చాలా సురక్షిత మాధ్యమమని వెల్లడించారు. కార్యాలయంలో ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించే అన్ని ఆఫర్లు ఈ సర్వీస్ ద్వారా పొందవచ్చని తెలిపారు.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments