నోకియా స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధరెంతో తెలుసా?

దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. దీని ధర కూడా తగ్గనుంది. ఓ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ ఇస్తోంది. 2017 ఆరంభంలో ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

Nokia D1C smartphone
pnr| Last Updated: సోమవారం, 12 డిశెంబరు 2016 (11:38 IST)
దేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ రానుంది. దీని ధర కూడా తగ్గనుంది. ఓ సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ ఇస్తోంది. 2017 ఆరంభంలో ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇతర కంపెనీ ఫోన్లకు ధీటుగా నోకియా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఉండబోతున్నాయి.

నోకియా డీ1సీ మోడల్ పేరుతో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. 2జీబీ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను 10 వేలకు, 3 జీబీ ర్యామ్ కలిగిన ఫోన్లను 13 వేలకు విక్రయించాలని నోకియా భావిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 జీపీయూ, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా డీ1సీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది.

10 వేల రూపాయల మోడల్ స్మార్ట్‌ఫోన్ 13 ఎంపీ కెమెరాతో, 13 వేల రూపాయల ఫోన్ 16ఎంపీ కెమెరాతో రూపొందించారు. ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫీచర్లకు ఏ మాత్రం తగ్గకుండా, వాటన్నింటి కంటే కారు చౌకగా స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చి తద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన సత్తా చాటేందుకు నోకియా రెడీ అయింది.దీనిపై మరింత చదవండి :