శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (15:36 IST)

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ : ఫిక్స్‌డ్‌ లైన్‌ కస్టమర్లకు 3 నెలలు ఉచిత డేటా

రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్‌డ్‌ లైన్ కస్టమర్లకు మూడు నెలల పాటు ఉచిత డేటాను అందచేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సరికొత్త బ్రాడ్‌బ్యాం

రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్‌డ్‌ లైన్ కస్టమర్లకు మూడు నెలల పాటు ఉచిత డేటాను అందచేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సరికొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉచిత కాల్స్‌ను కూడా అందించనుంది. వి-ఫైబర్‌ టెక్నాలజీ ఆధారంగా ఫిక్స్‌లైన్‌ ఫోన్లతో అధిక వేగంతో కూడిన డేటా కనెక్టివిటీని అందించే విధంగా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేసినట్టు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ముంబై) సమీర్‌ బాత్రా తెలిపారు. 
 
దీని ద్వారా 100 ఎంబిపిఎస్‌ వరకు వేగంతో డేటాను అందించవచ్చన్నారు. ఇప్పటికే తమకు 3.51 లక్షల మంది ఫిక్స్‌డ్‌ లైన్‌ కస్టమర్లున్నారని, వీరిలో అధిక శాతం మంది ఎంటర్‌ప్రైజెస్‌ కస్టమర్లేనని ఆయన తెలిపారు. వీరంతా హైస్పీడ్‌ కవరేజీకి మారవచ్చన్నారు. కొత్త ప్లాన్‌ తీసుకున్న వారికి మూడు నెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవన్నారు. 10 జిబి కలిగిన బేసిక్‌ ప్లాన్‌ 599 రూపాయలతో ప్రారంభం అవుతుందని చెప్పారు. 1,299 రూపాయల రెంటల్‌తో నెలకు 60 జిబి డేటా ప్లాన్‌ను తీసుకునే వారికి ఉచిత అపరిమిత కాలింగ్‌ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.