6000 మంది టెలికాం ఉద్యోగుల మెడపై కత్తి : రిక్రూట్‌మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ వార్నింగ్

టెలికాం రంగంలో ఈ యేడాది ఆరు వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో రెవెన్యూల దెబ్బ, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అద్దెలు రాకపోవడం టవర్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులప

telecom companies logo's
pnr| Last Updated: మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (13:36 IST)
టెలికాం రంగంలో ఈ యేడాది ఆరు వేల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో రెవెన్యూల దెబ్బ, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అద్దెలు రాకపోవడం టవర్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులపై వేటు వేయాలని అన్ని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగా సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోనున్నారు.

వచ్చే ఐదేళ్లలో టెలికాం టవర్ కంపెనీల్లో పనిచేసే 10 శాతం మందికి ఉద్యోగాలు పోతాయని రిక్రూట్‌మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికాం టవర్ సంస్థలు 60 వేల మంది ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. వీరిలో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. టెలికాం ఇండస్ట్రీతో సంబంధమున్న సేల్స్, మార్కెటింగ్, కార్పొరేట్ ఆఫీసు ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :