రూ.49కే అపరిమిత డేటా.. ఆర్‌కామ్ హోలీ ఆఫర్
రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు కురిపిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా హోలీ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ 2జీ, 3జీ, 4జీ కస్టమర్లకు వర్తించేలా ప్రకటించడం గమన
రిలయన్స్ జియో దెబ్బకు దేశంలోని టెలికాం కంపెనీలు ఆఫర్లపై ఆఫర్లు కురిపిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా హోలీ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్ 2జీ, 3జీ, 4జీ కస్టమర్లకు వర్తించేలా ప్రకటించడం గమనార్హం.
ఈ కంపెనీ విడుదల చేసిన ప్రకటన మేరకు... కొత్తగా 4జీ సిమ్ కార్డులు తీసుకునేవారికి రూ.49కే 1జీబీ డేటాను పొందవచ్చు. అలాగే, రూ.149కే 3జీబీ డేటాను అందించనుంది. అంతేకాక, తమ నెట్‌వర్క్ పరిధిలో ఫ్రీగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది.
హోలీ పండగ నేపథ్యంలో ఈ ఆఫర్ 28 రోజుల కాలపరిమితితో చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అలాగే 3జీ, 2జీ కస్టమర్ల కోసం కూడా పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.99కే అపరిమిత 3జీ డేటా, రూ.49కే అపరిమిత 2జీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది.