ఫ్లిఫ్ కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. రూ.17,999లకే పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్

Last Updated: సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:38 IST)
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిఫ్ కార్ట్ మరోసారి మొబైల్ బొనాంజా సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ వుంటుందని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. ఇందులో భాగంగా  భారీ స్మార్ట్ ఫోన్లకు డిస్కౌంట్లు ప్రకటించింది. కొన్ని బ్యాంకుల కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి అదనపు డిస్కౌంట్లు కూడా ఇస్తామని పేర్కొంది. 
 
వివరాల్లోకి వెళితే.. రూ. 19,999 ఎంఆర్పీతో వున్న పోకో ఎఫ్‌‌1 స్మార్ట్ ఫోన్‌.. రూ.17,999లకే అందించనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. 6జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ ఉన్న ఈ ఫోన్ రూ.3,000  ఎక్స్చేంజ్‌ ఆఫర్‌‌లో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 
 
అదేవిధంగా మోటరోలా వన్‌ పవర్‌ 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ను రూ. 13,999కే అందిస్తామని, ఎం2- 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఫోన్‌పై రూ. 3 వేలు డిస్కౌంట్ ఇస్తూ, రూ.11,999కే అందించనుంది.దీనిపై మరింత చదవండి :