మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (07:23 IST)

అది ఫోన్ కాదు 'రెడ్ బాంబ్'... చిత్తూరులో రెడ్మీ నోట్ 4 బ్లాస్ట్..

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీకి చెందిన రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది. ఇప్పటికే ఈ సిరీస్ ఫోన్లు వరుసబెట్టి పేలిపోతున్న వార్తలు అనేక వచ్చాయి. ఇపుడు చిత్తూరు జిల్లాలో మరో రెడ్మీ నోట్ 4 పేలింది.

చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమీకి చెందిన రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది. ఇప్పటికే ఈ సిరీస్ ఫోన్లు వరుసబెట్టి పేలిపోతున్న వార్తలు అనేక వచ్చాయి. ఇపుడు చిత్తూరు జిల్లాలో మరో రెడ్మీ నోట్ 4 పేలింది. 
 
గత నెలలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా మంటలంటుకుని పేలిపోగా, ఈ ప్రమాదంలో యువకుడి తొడకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే, మొన్నటికి మొన్న విశాఖపట్టణం జిల్లాలో చార్జింగ్ పెట్టిన కాసేపటికే ఫోన్ పేలింది. 
 
తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వేల్కూరులో రెడ్మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది. గ్రామానికి చెందిన కె.అజిత్ అనే యువకుడు ఇంట్లో ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా పేలిపోయింది. 
 
దీనిపై షియోమీ యాజమాన్యం స్పందించింది. ఫోన్‌లో ఎటువంటి సమస్యా లేదని, అధిక ఒత్తిడే ఫోన్ పేలుడుకు కారణమని స్పష్టం చేసింది. కాగా, రెడ్మీ నోట్ 4 ఫోన్లు వరుస పెట్టి పేలిపోతుండడంపై మొబైల్ యూజర్లు మాత్రం భయంతో హడలిపోతున్నారు.