షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్‌ను చైనాలో షియోమీ గత నెలలోనే వి

Selvi| Last Updated: బుధవారం, 9 ఆగస్టు 2017 (17:07 IST)
భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్‌ను చైనాలో షియోమీ గత నెలలోనే విడుదల చేసింది. కానీ భారత మార్కెట్లోకి ఈ మొబైల్ వచ్చే నెల రానుంది. దీనిధర రూ.14,200.

ఈ స్మార్ట్ ఫోనులో 12 మెగాపిక్సల్‌తో రెండు వెనుక కెమెరాలు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్ వంటివి వున్నాయి. వీటితో పాటు 5.5అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, 5 మెగాపిక్స‌ల్ ముందు కెమెరా, 64జీబీ అంతర్గత స్టోరేజీ, 3,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని ఈ ఫోను కలిగివుంటుంది. ఎంఐ 5 ఎక్స్ ఫోన్లు మూడు రంగుల్లో లభిస్తాయి. నలుపు, బంగారం, రోజా రంగుల్లో ఈ ఫోన్లను భారత మార్కెట్లోకి సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు జియోమీ వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :