శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (13:24 IST)

కామాంధుడికి తగిన శాస్తి: భార్యను హతమార్చిన కామాంధుడి మర్మాంగాన్ని నలిపి చంపేశాడు..

చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. కట్టుకున్న భార్యను అత్యాచారయత్నం చేసి ఆపై హత్య చేశాడని తెలుసుకున్న బాధితురాలి భర్త.. పట్టపగలే గ్రామప్రజల ముందు రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశాడు. బా

చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. కట్టుకున్న భార్యను అత్యాచారయత్నం చేసి ఆపై హత్య చేశాడని తెలుసుకున్న బాధితురాలి భర్త.. పట్టపగలే గ్రామప్రజల ముందు రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశాడు. బాధితురాలి భర్త చేతిలో హత్యకు గురయ్యేందుకు ముందు రోజు కోర్టు వాయిదాకు హాజరైన నిందితుడు తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని న్యాయమూర్తిని విన్నవించుకున్న 24 గంటల్లోనే హతుడయ్యాడు. ఈ ఘటన ఏపీ, చిత్తూరు జిల్లా పీలేరు మండలం జాండ్ల పంచాయతీ బసిరెడ్డిగారిపల్లెతాండాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 2015 సెప్టెంబరులో అదే గ్రామానికి చెందిన రాజేంద్రనాయక్ భార్య రెడ్డెమ్మపై గ్రామ శివారులోని మామిడితోటలో అత్యాచారం చేయబోయాడు. అందుకు ఆమె ప్రతిఘటించడంతో ఆమెను చంపేశాడు. రెడ్డినాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచి.. జైలుకు తరలించారు. ఆపై బెయిల్‌పై వచ్చినా సొంత గ్రామానికి నిందితుడు వచ్చేవాడు కాదు. అయితే స్వగ్రామానికి వెళ్లాలని తనకు రక్షణ కావాలని మూడే రెడ్డి నాయక్‌ న్యాయమూర్తి కోరాడు. 
 
వివాహిత రెడ్డెమ్మను హత్య చేసిన తరువాత మొదటిసారి రెడ్డినాయక్‌ గురువారం సాయంత్రం భార్యబిడ్డలతో కలిసి బసిరెడ్డిగారిపల్లెతాండాకు వచ్చాడు. దీంతో తన భార్యను చంపిన నిందితుడిని గ్రామానికి రావడంతో భర్త రాజేంద్రనాయక్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. రెడ్డినాయక్ కేకలు వేయడంతో అతని మర్మాంగాన్ని నలిపి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.