శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (14:26 IST)

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆ బిల్లు మాదికాదు... రిలయన్స్ జియో

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బిల్లు తమ కంపెనీ విడుదల చేసింది కాదనీ రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ బిల్లు పోస్ట్ చేసిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బిల్లు తమ కంపెనీ విడుదల చేసింది కాదనీ రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ బిల్లు పోస్ట్ చేసిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.
 
వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు ఫ్రీ డేటాను తమ కస్టమర్లకు రిలయన్స్ జియో అందించిన విషయం తెల్సిందే. అయితే ఫేస్‌బుక్, వాట్సాప్‌లో హల్‌చల్ చేసిన ఓ పోస్ట్ వినియోగదారులను గందరగోళానికి గురి చేయడమే కాకుండా, ఆందోళనరేకెత్తించింది.
 
కోల్‌కత్తాకు చెందిన అయునుద్దిన్ మొండల్‌‌కు బిల్లు పంపిన బిల్లులో 550జీబీ వాడుకున్నందుకుగానూ 27వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు ఆ బిల్లులో ఉంది. బిల్లుకు సంబంధించిన కాపీ ఇదిగో అంటూ పోస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్ట్ నిజం కాదని రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు.