గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (09:39 IST)

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. టాప్-3 స్థానాల్లో ఒప్పోనియో 7, షియోమీ రెడ్ మీ నోట్ 3 ప్రో నిలిచాయి. ఇక శాంసంగ్‌కు చెందిన శాంసంగ్ గురు 1200 నెంబర్ వన్ ఫీచర్ ఫోనుగా నిలిచింది. 
 
ఇకపోతే.. దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న శాంసంగ్ గెలాక్సీ జే7‌ను పంజాబ్‌లో అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఈ ఫోనుకు సంబంధించి అత్యధిక ఆర్డర్లు కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇక తమిళనాడులో జీఫైవ్ బ్రాండ్‌కు చెందిన డబ్ల్యూ 1.. నెంబర్ వన్ ఫీచర్ ఫోన్‌గా నిలిచింది.