ఈనెల 19న శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+ లాంచ్

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ శామ్‌సంగ్ ఈనెల 19వ తేదీన తన న్యూ ప్రాడెక్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమీ కూడా తన కొ

samsung8 smartphone
pnr| Last Updated: సోమవారం, 17 ఏప్రియల్ 2017 (17:25 IST)
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ శామ్‌సంగ్ ఈనెల 19వ తేదీన తన న్యూ ప్రాడెక్ట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం జియోమీ కూడా తన కొత్త మోడల్‌ను అదే రోజున ఆవిష్కరించనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. సౌత్ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఈ యేడాది మార్చిలో ఎస్8, ఎస్8+లను ప్రవేశపెట్టింది. భారత్‌ మార్కెట్‌లోకి మాత్రం ఈనెల 19వ తేదీన ప్రవేశపెట్టనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లను పరిశీలిస్తే... ఎస్8లో 5.8 అంగుళాల స్క్రీన్, ఎస్8+లో 6.2 అంగుళాల స్క్రీన్ కలిగివుంటుంది. అలాగే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో పాటు... శామ్‌సంగ్ బిక్స్‌బే, బయోమెట్రిక్ టెక్నాలజీస్, శామ్‌సంగ్ డీఈఎక్స్, 3500ఎంఏహెస్ బ్యాటరీ, క్వాల్కమ్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ, ముందు, వెనుక భాగాల్లో 12 మెగా పిక్సెల్ కెమెరా విత్ డ్యుయల్ పిక్సెల్ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో ఎస్8 ధర రూ.46,753, ఎస్8+ ధర రూ.54,545.దీనిపై మరింత చదవండి :