మీరు చేస్తున్నఈ పొరపాట్లే మీ ఫోన్ బ్యాటరీని చంపేస్తున్నాయి...

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మ‌న జీవితంలో భాగం అయిపోయింది. కాసేపు సెల్ ఫోన్ లేక‌పోతే, పిచ్చెక్కిపోయిన‌ట్లు ఉంటుంది. ఫోన్ విడిచి ఉండ‌లేనివారు ఎంద‌రో ఉన్నారు. మరి ఇంతలా ఫోన్ వాడుతున్నవారికి... మీ బ్యాట‌రీ ఛార్జింగ్‌లో అని చూపిస్తే, చిర్రెత్తుకొస్తుంది. స‌మ

nexus smart phones
JSK| Last Modified సోమవారం, 7 నవంబరు 2016 (20:12 IST)
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మ‌న జీవితంలో భాగం అయిపోయింది. కాసేపు సెల్ ఫోన్ లేక‌పోతే, పిచ్చెక్కిపోయిన‌ట్లు ఉంటుంది. ఫోన్ విడిచి ఉండ‌లేనివారు ఎంద‌రో ఉన్నారు. మరి ఇంతలా ఫోన్ వాడుతున్నవారికి... మీ బ్యాట‌రీ ఛార్జింగ్‌లో అని చూపిస్తే, చిర్రెత్తుకొస్తుంది. స‌మ‌యానికి ఛార్జ‌ర్ లేక‌పోయినా, అది పెట్ట‌డానికి ప‌వ‌ర్ సాకెట్ దొర‌క‌క‌పోయినా అస‌హ‌నం రెట్టింపు అవుతుంది. అస‌లు మీ సెల్‌లో బ్యాటరీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. బ్యాటరీ లైఫ్‌ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?

ఒకప్పుడు సెల్ ఫోన్స్‌లో నికెల్ బ్యాటరీస్ వాడేవారు. కాని ఇప్పుడు లిధియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు అయితే ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. నికెల్ బ్యాటరీస్ వాడే సమయంలో అందులో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోయేవరకు వాడి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టమని కంపెనీలు చెప్పేవి. కాని ఇప్పుడు వస్తున్న లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువకాలం మన్నాలంటే 40-80 రూల్ పాటించాలి. ఇప్పుడు మీ ఫోన్‌ని 0-100 శాతం వరకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టడం మానేయండి.

ఇలా చేస్తే ప్రతిసారి బ్యాటరీ ఓవర్‌హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. 40 శాతం బ్యాటరీ మిగిలుండగానే ఛార్జింగ్ పెట్టి 80 శాతం వచ్చాక ఛార్జింగ్ తీసేయండి. ఒకవేళ ఛార్జింగ్ 40 శాతం కన్నా తక్కువగా ఉంటే కనీసం 20 శాతం ఉండేటట్టు చూసుకోండి. 0-20 అలాగే 80-100 వరకు ఛార్జింగ్ పెడితే లిథియం అయాన్ బ్యాటరీస్ త్వరగా దెబ్బతింటాయి. ఏళ్ల తరబడి రావాల్సిన బ్యాటరీస్ కొన్ని నెలలకే పాడయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయాన్ బ్యాట‌రీని ఓవర్ హీట్ చేస్తే ప్ర‌మాదం!
లిథియం అయాన్ బ్యాటరీస్‌ను ఓవర్‌హీట్ చేస్తే దాదాపు 35 శాతం వరకు శక్తిని కోల్పోతుందని బ్యాటరీ యూనివర్సిటీ వారు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీస్‌ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక్కసారికి 40 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ పెట్టకూడదట. అలా చేస్తే మీ ఫోన్ బ్యాటరీ తొందరగా పాడవుతుందట. 1,500 సార్లు ఛార్జింగ్ పెడితే 10 శాతం శక్తిని కోల్పోయే బ్యాటరీస్.. కేవలం 400 సార్లకే 35 శాతం శక్తిని కోల్పోతుంది. కాబ‌ట్టి మీరు ఇక నుంచి 40-80 రూల్ పాటిస్తే, మీ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది.దీనిపై మరింత చదవండి :